test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రైవేట్ ఉద్యోగులకు మొదటి రోజే జీతాలు

19 మే, 2026

dubai
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 19, 2026, 11:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని ప్రైవేట్ రంగ ఉద్యోగులకు జీతాల చెల్లింపుపై కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. దేశ కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, ఇకపై ప్రైవేట్ రంగ ఉద్యోగులందరికీ ప్రతి నెల మొదటి తేదీన జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా కఠినంగా అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కార్మికులకు వేతనాలు సకాలంలో అందేలా చూడటమే ఈ సంస్కరణ ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిబంధనలు దేశంలోని వేతన రక్షణ వ్యవస్థ (డబ్ల్యుపిఎస్)లో నమోదు చేసుకున్న అన్ని ప్రైవేట్ సంస్థలకు వర్తిస్తాయి. కొత్త ఆదేశాల ప్రకారం, ప్రతి నెల చేసిన పనికి సంబంధించిన జీతం తర్వాతి నెల మొదటి రోజునే ఉద్యోగి ఖాతాలో జమ కావాలి. వేతనాలను డబ్ల్యుపిఎస్ లేదా మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఇతర అధికారిక మార్గాల ద్వారానే బదిలీ చేయాలి. అదనంగా, ఉద్యోగికి జీతం చెల్లించినట్లు నిర్ధారించే పత్రాలను సంస్థలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. మొదటి తేదీ తర్వాత చెల్లించే జీతాలను “ఆలస్యపు వేతనాలు”గా పరిగణిస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించి జీతాలు ఆలస్యం చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జీతాల చెల్లింపులో ఆలస్యం జరిగిన ప్రారంభ రోజుల్లోనే ప్రత్యేక తనిఖీ బృందాలు ఆయా సంస్థలను పరిశీలిస్తాయి. ఐదు రోజులకుపైగా జీతాలు చెల్లించకపోతే, సంబంధిత సంస్థలకు కొత్త పని అనుమతులు జారీ చేయడాన్ని నిలిపివేస్తారు. పదకొండో రోజు వరకు కూడా వేతనాలు చెల్లించకపోతే, జరిమానాలు సహా మరింత కఠినమైన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్