ట్రుజిల్లో: అమెరికాలో గల హోండురాస్లోని తీర ప్రాంతాల్లో గురువారం జరిగిన రెండు కాల్పుల ఘటనల్లో ఆరుగురు పోలీసు అధికారులతో సహా కనీసం 25 మంది మరణించారని పోలీసులు తెలిపారు. మొదటి కాల్పుల ఘటన ఉత్తర హోండురాస్లోని ట్రుజిల్లో మునిసిపాలిటీ సమీపంలో ఉన్న ఒక క్వారీలో జరిగింది. ఈ దాడిలో కనీసం 19 మంది కార్మికులు మరణించారని ఎన్డిటివి నివేదించింది. గుర్తుతెలియని దుండగులు కార్మికులపై కాల్పులు జరిపారు. ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా వ్యవసాయ వివాదాలు కొనసాగుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.
రెండవ దాడి గ్వాటెమాలన్ సరిహద్దు సమీపంలోని కోర్టెస్ డిపార్ట్మెంట్లోని ఓమోవా మునిసిపాలిటీలో జరిగింది. ఈ దాడిలో ఆరుగురు పోలీసు అధికారులు మరణించారు. దాడి అనంతరం మృతుల బంధువులు మృతదేహాలను తరలిస్తున్నందున, కచ్చితమైన మృతుల సంఖ్యను నిర్ధారించడానికి సమయం పడుతుందని పోలీసులు తెలిపారు.









కామెంట్లు (0)