ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : పోలీసుల విచారణకు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ గైర్హాజరయ్యారు. పోక్సో కేసు విచారణ కోసం బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో హాజరు కావాలని ఆయనకు పోలీసులు మంగళవారం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తన కుమార్తెను భగీరథ్ వేధిస్తున్నాడంటూ 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్లో ఈ నెల ఎనిమిదిన కేసు నమోదైన సంగతి తెలిసిందే.కాగా, వ్యక్తిగత కారణాల వల్ల బుధవారం విచారణకు హాజరుకాలేకపోతున్నానని బండి భగీరథ్ బుధవారం పేట్ బషీరాబాద్ ఎస్‌హెచ్‌ఒకు మెయిల్ పంపాడు. ‘‘ప్రస్తుతం వ్యక్తిగత కారణాలతో విచారణకు హాజరు కాలేకపోతున్నాను. సంబంధిత అధికారుల ఎదుట హాజరై దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు రెండు రోజుల గడువు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాను. విచారణకు హాజరయ్యేందుకు మరో తేదీ సూచించగలరు’’ అని భగీరథ్ మెయిల్‌లో పేర్కొన్నారు.
పోలీసు విచారణకు బండి భగీరథ్ గైర్హాజరు
13 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 13, 2026, 03:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)