
– ఖైదీల మార్పిడికి ఇరు దేశాలు అంగీకారం
వాషింగ్టన్ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడు రోజుల తాత్కాలిక కాల్పుల విరమణతో పాటు ఖైదీల మార్పిడిని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మే 9 నుంచి 11 వరకు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని వైట్ హౌస్ వెల్లడించింది. రష్యా విజయ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మరియు రష్యా అధ్యక్షుడు పుతిన్ తరఫు సలహాదారు యూరి ఉషాకోవ్ అంగీకారం తెలిపినట్లు అధికారులు పేర్కొన్నారు. ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ఈ చర్య శాంతి దిశగా తొలి అడుగు కావాలని ఆశిస్తున్నట్లు ట్రంప్ మీడియాతో వ్యాఖ్యానించారు. ఒప్పందం ప్రకారం, మే 9 నుంచి 11 వరకు ఇరు దేశాలు అన్ని సైనిక చర్యలను నిలిపివేయనున్నాయి. అదేవిధంగా, ఇరు పక్షాల నుంచి సుమారు వెయ్యి మంది ఖైదీలను పరస్పరం విడుదల చేయడానికి అంగీకరించినట్లు వెల్లడించారు. అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చల ఫలితంగానే ఈ నిర్ణయం సాధ్యమైందని జెలెన్స్కీ తెలిపారు.









కామెంట్లు (0)