test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగాజాపై ఇజ్రాయిల్ దాడి.. పోలీస్ అధికారులు సహా ముగ్గురు మృతి

10 మే, 2026

Israeli strikes in Gaza kill three
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 10, 2026, 04:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కైరో : గాజాపై ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో హమాస్ నేతృత్వంలోని ఇద్దరు పోలీస్ అధికారులు సహా ముగ్గురు పాలస్తీనియన్లు మరణించినట్లు ఆరోగ్య అధికారులు ఆదివారం తెలిపారు. ఈ హింసాకాండ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు స్పష్టం చేస్తోంది. గాజా స్ట్రిప్ లోని మఘాజీ శరణార్థి శిబిరంపై జరిగిన వైమానిక దాడిలో ఒక వ్యక్తి మరణించగా, ఖాన్ యూనుస్ లోని నేర నిరోధక పోలీస్ దళం అధ్యక్షుడు వెస్సాం అబ్దెల్ హాది, ఆయన సహాయకుడు కూడా మరణించారని హమాస్ నేతృత్వంలోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. గాజాలోని పోలీస్ దళంపై ఇజ్రాయిల్ దాడులను తీవ్రతరం చేసిందని గతంలో జాతీయ మీడియా నివేదించిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఘటనలపై ఇజ్రాయిల్ సైన్యం స్పందించలేదు.

2025 అక్టోబర్ లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ.. గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. కాల్పుల విరమణ అమ ల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 850 మంది పాలస్తీనియన్లు మరణించారని స్థానిక వైద్యులు వెల్లడించారు.   2023 అక్టోబర్ లో గాజాపై ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుండి 72,500 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని, వారిలో ఎక్కువ మంది పౌరులేనని గాజా ఆరోగ్య అధికారులు ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్