వాషింగ్టన్: గల్ఫ్ మిత్రదేశాల అభ్యర్థన మేరకు ఇరాన్‌పై ప్రతిపాదిత దాడిని వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం సమస్య పరిష్కారానికి కీలక చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ నాయకత్వం విజ్ఞప్తి చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇరాన్‌పై కఠిన సైనిక చర్యకు వెనుకాడబోమని ఇటీవల పలుమార్లు హెచ్చరించిన ట్రంప్, ఇప్పుడు దాడిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల తర్వాత గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ భారీ ప్రతిదాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో తాత్కాలిక కాల్పుల విరమణ జరిగినప్పటికీ శాంతి ఒప్పందం మాత్రం కుదరలేదు. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్న వేళ యుద్ధ భయాలు మళ్లీ పెరుగుతుండగా ట్రంప్ తాజా ప్రకటన కొంత ఉపశమనాన్ని కలిగించింది. ఇటీవల చైనా పర్యటనలో భాగంగా ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరాన్ పరిస్థితులపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.
ఇరాన్‌పై దాడి వాయిదా
19 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 19, 2026, 11:18 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)