తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్ ప్రేమకథా చిత్రంగా నిలిచిపోయిన ‘గీతాంజలి’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 28న ఈ సినిమాను రీ-రిలీజ్ చేయనున్నట్లు ‘శ్రీ పద్మిని సినిమాస్’ ప్రకటించింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన తొలి తెలుగు చిత్రం ‘గీతాంజలి’. ఈ సినిమాతోనే గిరిజా శెట్టర్ కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. చావుకు దగ్గరవుతున్న ఇద్దరు ప్రేమికుల కథను భావోద్వేగంగా చూపించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భాగ్యలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో జాతీయస్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ఇప్పుడు లేటెస్ట్ సౌండ్, పిక్చర్ క్వాలిటీతో మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.
Print Editionఆగస్టు 28న గీతాంజలి రీ రిలీజ్
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 16, 2026, 09:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)