పనిలోనూ, ఆలోచనా విధానంలోనూ మనుషులకు తామేం
తక్కువ కాదని ఇప్పటికే కొన్ని హ్యుమనాయిడ్ రోబోలు నిరూపించాయి. తాజాగా పరుగు పందెం పోటీలోనూ సత్తా చాటాయి. చైనా రాజధాని బీజింగ్‌లో నిర్వహించిన హాఫ్మారథన్లో మనుషుల కంటే వేగంగా పరిగెత్తి రికార్డు సృష్టించాయి. ఈ పోటీలో 21 కిలోమీటర్ల పరుగును కేవలం 50 నిమిషాల 26 సెకన్లలోనే పూర్తి చేసింది ఓ రోబో. తొలి మూడు స్థానాల్లో రోబోలే విజేతలుగా నిలిచాయి.
3333 | bbbb | hhhh |
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న చైనా అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తోంది.
AI image బీజింగ్‌లో ‘యిజువాంగ్ హాఫ్ మారథాన్’ పేరుతో హ్యుమన్-రోబో జాయింట్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో సుమారు 12 వేల మంది మనుషులు, 100కు పైగా హ్యుమనాయిడ్ రోబోలు పోటీ పడ్డాయి. బీజింగ్‌లో ‘యిజువాంగ్ హాఫ్ మారథాన్’ పేరుతో హ్యుమన్-రోబో జాయింట్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో సుమారు 12 వేల మంది మనుషులు, 100కు పైగా హ్యుమనాయిడ్ రోబోలు పోటీ పడ్డాయి. బీజింగ్‌లో ‘యిజువాంగ్ హాఫ్ మారథాన్’ పేరుతో హ్యుమన్-రోబో జాయింట్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఇందులో సుమారు 12 వేల మంది మనుషులు, 100కు పైగా హ్యుమనాయిడ్ రోబోలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో 21.1 కిలోమీటర్ల దూరాన్ని 50 నిమిషాల 26 సెకన్లలో లైటినింగ్ రోబో పూర్తి చేసి రికార్డు నెలకొల్పింది. 51 నిమిషాల్లో మరో రోబో, 53 నిమిషాల్లో ఇంకో రోబో తమ పరుగును పూర్తి చేసి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
చైనాకు చెందిన టెక్ కంపెనీ హానర్ ఈ లైటినింగ్ రోబోను రూపొందించింది. పరిగెత్తే సమయంలో రోబో నుంచి వెలువడే వేడిని నియంత్రించేందుకు ఫోన్లలో వాడే అడ్వాన్స్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని ఇందులో వినియోగించినట్లు రోబో ఇంజినీర్ పేర్కొన్నారు. పరుగు కోసం 90 నుంచి 95 సెంటీమీటర్ల పొడవుతో ప్రత్యేకంగా కాళ్లను రూపొందించినట్లు తెలిపారు. కాగా, ఈ పోటీలో మనిషి 1 గంట 7 నిమిషాల 47 సెకన్లలో గమ్యాన్ని చేరుకోవడం గమనార్హం.








కామెంట్లు (0)