సీనియర్ కథానాయకుడు ఘట్టమనేని కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమాలో జయకృష్ణ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా టాండన్ నటిస్తోంది. ఈమెకు కూడా ఇది టాలీవుడ్‌లో మొదటి సినిమా. ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్రబృందం సెకండ్ సింగిల్ అప్‌డేట్‌ను ఇచ్చింది. ‘మంగా మంగా’ అంటూ సాగే ఈ పాటను మే 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో జయకృష్ణ తన ‘మంగ’ రాషాను చూస్తూ ఉండిపోయిన దృశ్యం ఉంది. దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో పక్కా యాక్షన్ ఓరియెంటెడ్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇందులో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
Print Editionనేడు 'శ్రీనివాస మంగాపురం` పాట విడుదల
12 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 12, 2026, 09:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)