mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచివరి షెడ్యూల్‌‌కు చేరుకున్న ‘మండాడి’

13 మే, 2026

చివరి షెడ్యూల్‌‌కు చేరుకున్న ‘మండాడి’
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 13, 2026, 09:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కోలీవుడ్‌ నటుడు సూరి, టాలీవుడ్‌ హీరో సుహాస్‌ కలయికలో రూపొందుతున్న బహునటుల చిత్రం ‘మండాడి’. మతిమారన్‌ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో సాగే ఉత్కంఠభరిత క్రీడా-యాక్షన్‌ కథగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో మహిమా నంబియార్‌ కథానాయికగా నటిస్తుండగా, సీనియర్‌ నటుడు సత్యరాజ్‌, రవీంద్ర విజయ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. ఎల్రెడ్‌ కుమార్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. తాజా సమాచారం మేరకు, ఈ చిత్రాన్ని ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం యోచిస్తున్నట్లు తెలిసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్