విజయవాడ : నీట్ పరీక్షా పేపర్ లీకేజ్‌ను సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. పరీక్షల నిర్వహణ నుండి ఎన్.టి.ఎ.ను తప్పించాలని డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి బుధవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనను విడుదల చేశారు. లీకేజ్ దాదాపు 23 లక్షల మంది విద్యార్థులను తీవ్రమైన మానసిక ఒత్తిడిని గురిచేసిందన్నారు. ఎన్‌టిఎ నిర్వహిస్తున్న అనేక పరీక్షల్లో పెద్ద ఎత్తున అవినీతి, నిర్వహణ లోపాలు, లీకేజీలు మొదటిది కాదు అని, ప్రారంభం నుండీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షా వ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తూనే ఉంది అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ కేంద్రీకరణ ఆలోచనతో దేశవ్యాప్తంగా ఎగ్జామ్ మాఫియా దారితీసిందన్నారు. ఇది భారీ ఎత్తున కోచింగ్ మార్కెట్‌ను ప్రోత్సహించి, మధ్య తరగతి, పేద విద్యార్థులను, తల్లిదండ్రులను దోపిడీకి, అభద్రతాభావానికి గురిచేస్తోందని తెలిపారు. ఈ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరపి వాస్తవాలు దేశ ప్రజలకు చెప్పాలని కోరారు. విద్యార్థులు ఎదుర్కొన్న ఆర్థిక భారానికి పరిహారం చెల్లించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కేంద్రీకరణ విధానాన్ని విడనాడాలన్నారు. ఎన్టిఏను రద్దు చేయాలని, గతంలో మాదిరిగా సంబంధిత ప్రభుత్వ సంస్థలకే ఆ బాధ్యత అప్పగించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
నీట్ పేపర్ లీకేజి పట్ల సిపిఐ(యం) ఖండన
13 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 13, 2026, 03:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)