test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్టీల్ ప్లాంట్ లో మరణాలను ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలి : ఏఐఎఫ్ టియు న్యూ

6 రోజుల క్రితం

Deaths in steel plant should be treated as government killings
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 09, 2026, 03:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి...విజయనగరం టౌన్ :  స్టీల్ ప్లాంట్  కార్మికుల మరణాలను  ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలని  రైతు కూలి సంఘం ఏ ఐ ఎఫ్ టి యూ న్యూ డిమాండ్ చేసింది.  స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారి  కుటుంబాలను ఆదుకోవాలని, మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్  చేస్తూ మంగళవారం నిరసన చేపట్టారు. రైతు కూలి సంఘం రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ మాట్లాడుతూ.. ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని అన్నారు. నైతిక బాద్యతగా  కూటమి ప్రభుత్వం నూతనంగా నియమించిన సి, ఎం, డి రాజీనామా చేయాలనీ , పాతబడిన యంత్ర పరికరాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించి కొత్తవాటిని ఏర్పాటు చెయ్యాలని, మరణించిన  ఉద్యోగుల కుటుంబాలను పూర్తిగా ఆదుకోవాలని, గాయపడిన కార్మికులకు సరియైన వైద్య సహాయంతో పాటు పూర్తి వేతనంతో  కూడిన సెలవు మంజూరు చెయ్యాలని, కొత్తగా తగినంత మందిని  నియమించాలని ప్రభుత్వ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఏ ఐ ఫ్ టి యూ న్యూ రాష్ట్ర కమిటీ సభ్యులు రెడ్డి నారాయణరావు మాట్లాడుతూ..  భద్రతా వైఫల్యం, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది తప్ప మరొకటి  కాదని, దీంతో ఇవి  ముమ్మాటికీ ప్రభత్వ హత్యలు గానే భావించాలని అన్నారు. మరణించిన  కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు ఎన్ అప్పలరాజు రెడ్డి తో పాటు చెన్నా ధర్మారావు, కంది రాము తో పాటు కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్