ప్రజాశక్తి-జగ్గంపేట : జగ్గంపేట మండలం జె. కొత్తూరు శివారు ప్రాంతంలో రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరాలపై గురువారం పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వివరాలను ఎస్ఐ ఘునాధరావు మీడియాకు వెల్లడించారు.జె. కొత్తూరు పరిసరాల్లో రహస్యంగా కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఈ దాడులు చేపట్టినట్లు తెలిపారు. ఈ పందాలలో పాల్గొన్న నలుగురుని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 2,050 నగదు, 2 కోడి పుంజులు, 2 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మండల పరిధిలో ఎక్కడైనా జూదాలు, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. సమాచారం ఇవ్వాలనుకునే వారు 9440796529, 9440796569 నంబర్లను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గుప్తంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.
జగ్గంపేటలో కోడిపందాలపై పోలీసుల దాడి: నలుగురు అరెస్ట్
11 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 11, 2026, 12:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)