ప్రజాశక్తి-ప్రత్తిపాడు (కాకినాడ) : బైక్ ను పాల ట్యాంకర్ ఢీకొట్టడంతో మహిళ మృతి చెందిన ఘటన గురువారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో జరిగింది. సంతోషిమాత ఆలయం సమీపంలో ఈ విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరప మండలం నడకుదురు గ్రామానికి చెందిన భార్యాభర్తలు చిన్నఏలూరు గ్రామంలో పొలం పనులు చూసుకుని మోటార్‌సైకిల్‌పై ప్రత్తిపాడు వైపు వస్తున్నారు. సంతోషిమాత ఆలయం వద్ద రహదారి దాటుతుండగా దొడ్ల డెయిరీకి చెందిన పాల ట్యాంకర్ వారి బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ బైక్‌పై నుంచి కింద పడిపోయింది. అనంతరం ట్యాంకర్ ఆమె తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతురాలిని బొడ్డు పద్మావతి (51), కొప్పుల వేలమ, నడకుదురు గ్రామం, కరప మండలం వాసిగా గుర్తించారు. ఈ ఘటనపై ప్రత్తిపాడు ఎస్‌ఐ లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బైక్ ను ఢీకొట్టిన పాల ట్యాంకర్ – మహిళ మృతి
11 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 11, 2026, 01:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)