mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎకనామిక్స్ లో పరిశోధనలు – రైతు బిడ్డకు గోల్డ్ మెడల్

11 జూన్, 2026

Research in Economics – Gold Medal for a Farmer's Child
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 11, 2026, 03:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • గోల్డ్ మెడల్ సాధించిన రైతు బిడ్డ

ప్రజాశక్తి-కలకడ (అన్నమయ్య) : పీహెచ్డీ పూర్తి చేసి తన ఎకనామిక్స్ లో చేసిన పరిశోధనల కారణంగా రైతు బిడ్డ గోల్డ్ మెడల్ సాధించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కష్టాన్ని ఆయుధంగా మలుచుకుని, శ్రమను తన బలంగా మార్చుకొని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కష్టపడి చదివి పది మందికి ఆదర్శంగా నిలిచిన దగ్గుపాటి రామానుజులు యదార్ధ గాధ అందరికీ నిదర్శనంగా నిలిచింది. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం ఎస్ సోమవారం మజారా అగ్రహారంలో నివసించే లేట్ దగ్గుపాటి లక్ష్మన్న, దగ్గుపాటి కృష్ణమ్మల ఏకైక కుమారుడు దగ్గుబాటి రామానుజులు. భార్య రెడ్డమ్మ తిరుపతి మున్సిపాలిటీలో సచివాలయం నందు వెల్ఫేర్ సెక్రటరీ ఉద్యోగిగా, కుమారుడు రిషికేష్ బీటెక్ చదువుతూ, కుమార్తె శ్రీవిద్య ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు గురువారం ప్రజాశక్తికి తెలిపారు. చిన్నప్పటినుండి కష్టపడి చదివి విద్యాభ్యాసంలో రామానుజులు మేటిగా నిలిచారు. ప్రాథమిక విద్యను స్వగ్రామం లో పూర్తిచేసి, ఉన్నత విద్యను కలకడ బాటవారిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్తి చేసినట్లు వివరించారు. ఇంటర్మీడియట్, డిగ్రీని పీలేరు ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేసినట్లు తెలిపారు. తను విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలోనే చదివి ఉత్తమ ఫలితాలు సాధిస్తూ తరగతిలో ప్రధమ స్థానంలో ఫలితాలు సాధిస్తూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి, పెద్దల పట్ల మర్యాదపూర్వకంగా, గురువుల పట్ల క్రమశిక్షణతో మెలిగి, భవిష్యత్తు కోసం పునాదిరాళ్లు వేసుకొని ఇటు గ్రామంలో అటు మండలంలో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి దగ్గుపాటి రామాంజనేయులు అని పలువురు ప్రశంసించారు. చదువులో పట్టుదల వదలని విక్రమార్కుడిలా పోరాడి పీహెచ్డీ పూర్తి చేసి తన ఎకనామిక్స్ లో చేసిన పరిశోధనల కారణంగా గోల్డ్ మెడల్ సాధించి మండలానికి తలమానికంగా డి రామాంజులు నిలిచారని, రైతు బిడ్డ గోల్డ్ మెడల్ సాధించడం అందరికీ గర్వకారణమని గ్రామస్తులంతా హర్షాన్ని వ్యక్తం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్