mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Stock Markets – కొనసాగుతోన్న స్టాక్‌ మార్కెట్ల పతనం – హడలెత్తిపోతున్న మదుపర్లు..!

24 ఫిబ్రవరి, 2026

Stock market
avatar
Mathew

ప్రచురించబడింది ఫిబ్ర 24, 2026, 04:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

 గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ల పతనం ఇప్పటికీ కొనసాగుతోంది. ట్రేడింగ్‌ సెషన్‌ మొదలవుతుందంటేనే మదుపర్లు హడలెత్తిపోతున్నారు. వీటి మధ్య సోమవారం ట్రేడింగ్‌ సెషన్‌లోనూ సెన్సెక్స్‌, నిఫ్టీలు భారీగా క్షీణించాయి. ఈరోజు ఉదయం 10:45 సమయానికి సెన్సెక్స్‌ 731 పాయింట్లు పడి 74,580 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ50 225 పాయింట్లు కోల్పోయి 22,571 వద్ద కొనసాగుతోంది. ”ట్రంప్‌ టారిఫ్‌లు, నిరంతర ఎఫ్‌ఐఐ విక్రయాలు, ప్రపంచ అనిశ్చితుల నుంచి మార్కెట్‌ ప్రతికూలతలను ఎదుర్కొంటోంది,” అని జియోజిట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వి.కె. విజయకుమార్‌ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో మందగమనం సంకేతాలు కనిపిస్తున్నాయని, ఇది ఇన్వెస్టర్ల రిస్క్‌ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది స్టాక్‌ మార్కెట్‌ రికార్డు గరిష్టాలకు చేరుకోవడానికి భారత ఆర్థిక వృద్ధి స్థితిస్థాపకతే ప్రధాన కారణం. అయితే, ఇటీవలి స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రముఖ సంస్థల సవరించిన అంచనాలతో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మందగమనాన్ని ఎదుర్కొంటోందని సూచిస్తున్నాయి. అమెరికా సుంకాలు, ప్రపంచ డిమాండ్‌ మందగించడం వల్ల భారత జీడీపీ వృద్ధి రేటు 2024లో నమోదైన 6.6 శాతం నుంచి 2025 నాటికి 6.4

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్