న్యూఢిల్లీ : ‘టెలిగ్రామ్ పై నిషేధం’ అనేది ప్రధాని మోడీ కొత్త ఎత్తుగడ అని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. పేపర్ లీక్ మాఫియాపై చర్యలు చర్యలు తీసుకోవడానికి బదులుగా కేంద్రం విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటుందని బుధవారం ఎక్స్ లో పేర్కొన్నారు. నీట్ -యుజి ప్రశ్నాపత్రాల లీక్ ఆందోళన నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ పై కేంద్రం మంగళవారం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ‘టెలిగ్రామ్ పై నిషేధం’ దొంగను పట్టుకోవడానికి బదులుగా, బాధితుడి ఇంటి తలుపుకు తాళం వేయడం వంటిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది విద్యార్థులు ఏళ్లుగా టెలిగ్రామ్‌లో చదువుకుంటున్నారని అన్నారు. పేపర్ లీక్ లను అడ్డుకుంటామంటూ టెలిగ్రామ్ ను విద్యార్థుల నుండి దూరం చేయడం సరికాదని అన్నారు. లక్షలాది మంది విద్యార్థులు ఏళ్లుగా టెలిగ్రామ్‌లో నోట్స్, టెస్ట్ సిరీస్‌లు, చర్చలు, ప్రిపరేషన్ కోసం చదువుకుంటున్నారు. ఆ సౌకర్యాన్ని లాక్కోవడం పేపర్ లీక్‌లకు ఎలా పరిష్కారం అవుతుందని ప్రశ్నించారు. అనంతరం వాట్సప్ పై నిషేధం విధిస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. నీట్ పరీక్ష రోజున విద్యార్థులను తనిఖీ చేస్తారని, వారి జేబులను కత్తిరిస్తారని, కానీ ప్రభుత్వ పర్యవేక్షణలోనే పేపర్ లీక్ మాఫియా పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రాలను ఐఎఎఫ్ విమానాల్లో తరలించడం, ఇదంతా కేవలం విద్యార్థులను మభ్యపెట్టే హడావుడి, నాటకీయ చర్యలు మాత్రమేనని విమర్శించారు. సమస్య మూలాలపై చర్యలు తీసుకోకుండా, విద్యార్థుల భవిష్యత్తును అంధ:కారంలో పడేస్తోందని మండిపడ్డారు. మోడీజి ఇకనైనా నాటకాలు ఆపాలని, విద్యార్థులపై కాదు మాఫియాపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. లేదంటే తమ హక్కులను ఎలా సాధించుకోవాలో దేశంలోని యువతకు బాగా తెలుసని హెచ్చరించారు.
టెలిగ్రామ్ పై నిషేధం ప్రధాని మోడీ కొత్త ఎత్తుగడ : రాహుల్ గాంధీ
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 17, 2026, 03:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)