బ్యాంకాక్ : థాయిలాండ్ లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొనడం వలన చెలరేగిన మంటలు బస్సును, సమీపంలోని వాహనాలను చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో రు 8మంది మరణించగా, మరో 25 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. రైలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయని, అవి బస్సును, సమీపంలోని వాహనాలను చుట్టుముట్టాయని అన్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందిని, సహాయక బృందాలను ఘటనా స్థలానికి పంపినట్లు ప్రకటించారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకువచ్చారని, బాధితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు కొనసాగుతోంది.
థాయిలాండ్ లో ఘోర ప్రమాదం .. 8మంది మృతి
16 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 16, 2026, 05:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)