* ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి
ప్రజాశక్తి తిరుపతి బ్యూరో :
ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి' కార్యక్రమానికి 60 వినతులు అందినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా పలువురు వినియోగదారులు విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసమే ఏర్పాటు చేసిన 'డయల్ యువర్ సిఎండి' కార్యక్రమం ద్వారా నమోదయ్యే సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్లు: 1912 లేదా 1800 425 155333కు కాల్ చేయడం లేదా వాట్సాప్ నంబరు: 91333 31912కు చాట్ చేయడం, ఏపీఎస్పీడీసీఎల్ చాట్ బోట్ ద్వారా విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ఐటి) పి. అయూబ్ ఖాన్, డైరెక్టర్ (టెక్నికల్ & హెచ్ఆర్ డి) కే. గురవయ్య, డైరెక్టర్/ఫైనాన్స్ (ఎఫ్ఏసి) కె. రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు కె. ఆదిశేషయ్య, జె. రమణా దేవి, ఆర్. పద్మ, ఎం. మురళి కుమార్, ఎన్. శోభా వాలెంటీనా, ఎం. ఉమాపతి, సిహెచ్ రామచంద్ర రావు, ఎస్. రమణ, జనరల్ మేనేజర్లు సురేంద్ర రావు, చక్రపాణి, జగదీష్, లత, తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)