సంగం (నెల్లూరు) : సంగం మండలం దువ్వూరు గ్రామంలో సోమవారం విషాదం నెలకొంది. ఒకే ఇంట్లో రిటైర్డ్ టీచర్ మధు కుటుంబం ముగ్గురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతులు చీరాల మధు (65) రిటైర్డ్ టీచర్, భార్య రత్నావళి (50), కుమారుడు సాయి సుకృత్ (26) లుగా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యలకు గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు.
ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్య
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 15, 2026, 04:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)