test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బండి భగీరథ్‌పై లుకౌట్‌ నోటీసులు - 5 బృందాల గాలింపు

16 మే, 2026

బండి భగీరథ్‌పై లుకౌట్‌ నోటీసులు - 5  బృందాల గాలింపు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 16, 2026, 03:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ ‌: మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ దేశం దాటిపోకుండా పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. అతని కోసం 5 బృందాలు గాలిస్తున్నాయి. భగీరథ్‌పై ఇప్పటికే పోక్సో కేసు నమోదైంది. అతనితో టచ్‌లో ఉన్నవారిపై, స్నేహితులు, బంధువుల ఇళ్లపై పోలీసులు నిఘా ఉంచినట్లు సమాచారం. బంజారాహిల్స్‌లోని బండి సంజయ్‌ ఇంట్లో ఒక బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం .... జూన్ 2025 నుంచి భగీరథ్, బాలికను గ్రూమింగ్ చేసి, మద్యం తాగించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. డిసెంబర్ 31, 2025న మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఘటన జరిగినట్లు ఆరోపణలున్నాయి. మొదట ఐపీసీ సెక్షన్లు 74, 75తో పాటు పోక్సో సెక్షన్లు 11/12 కింద కేసు నమోదై, తర్వాత బాలిక స్టేట్‌మెంట్ ఆధారంగా అగ్రవేటెడ్ పెనిట్రేటివ్ అసాల్ట్ (POCSO సెక్షన్ 5(l) r/w 6) కింద అప్‌గ్రేడ్ చేశారు. ఇది 20 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష విధించే తీవ్రమైన సెక్షన్. బాధితురాలి ఫోన్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి చాట్స్, కాల్ డేటా, లొకేషన్ విశ్లేషిస్తున్నారు. ఫామ్‌హౌస్ సీసీటీవీ, సెల్ సిగ్నల్స్ కూడా సేకరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్