కోల్ కతా : తృణమూల్ కాంగ్రెస్ నేత, ఫాల్తా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి జహంగీర్ ఖాన్ను పశ్చిమబెంగాల్ పోలీసుల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సోమవారం అరెస్ట్ చేసింది. జహంగీర్ ఖాన్ పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతం నుండి దేశం విడిచిపారిపోయేందుకు యత్నించాడని పోలీసులు పేర్కొన్నారు. ఏప్రిల్ 29న ఫాల్తాలో రెండవ దశ పోలింగ్ సమయంలో జహంగీర్ ఖాన్ పై అవతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్నికల సంఘం ఆ ఎన్నికను రద్దు చేసి, మే 21న తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే జహంగీర్ ఖాన్ పోటీ నుండి వైదొలిగి, పరారీలో ఉన్నాడు. ఫాల్తాలో జరిగిన రీపోలింగ్ లో బిజెపి అభ్యర్థి లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుచుకున్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జహంగీర్ ఖాన్ పై గ్రామస్థులు భూకబ్జా, దోపిడీ ఆరోపణలు చేశారు.
పశ్చిమబెంగాల్ లో బిజెపి అధికారం చేపట్టిన తర్వాత అరెస్ట్ అయిన టిఎంసి నేతల జాబితాలో జహంగీర్ ఖాన్ కూడా చేరారు. మాజీ ఎమ్మెల్యేలతో సహా పలువరు టిఎంసి నేతలను పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. 2026 మార్చిలో బాంబు పేలుడులో పాత్ర ఉందనే ఆరోపణలపై, గతవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఎ) మాజీ ఎమ్మెల్యే సౌకత్ మూలాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.







కామెంట్‌లు (0)