కోల్ కతా : పశ్చిమబెంగాల్ లో టిఎంసికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాల మధ్య, సుఖేందు శేఖర్ రాయ్ పార్లమెంట్ ఎగువ సభ సభ్యత్వానికి, టిఎంసి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టిఎంసి ఘోర పరాజయం పాలవడంపై ఆయన తన రాజీనామా లేఖలో తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతులేని అవినీతి, మహిళలపై అఘాయిత్యాలు, విద్య, శాంతిభద్రతలు, ఆరోగ్యం, పారిశ్రామిక, ఉపాధి మొదలైన రంగాల్లో ఘోర వైఫల్యాలతో కూడిన మమతా బెనర్జీ నేతృత్వంలోని 15ఏళ్ల అరాచక పాలన ఫలితమే ఈ తీర్పు అని పేర్కొన్నారు. మమతా బెనర్జీ పాలనతో విసుగుచెందిన ప్రజలు రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారి బిజెపికి అనుకూలంగా ఓట్లు వేశారని అన్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో పార్టీ నుండి బహిష్కరించబడిన ఎమ్మెల్యే రిటాబ్రత బెనర్జీ నేతృత్వంలో ఇటీవల జరిగిన తిరుగుబాటు నేపథ్యంలో, టిఎంసి నుండి 20 మంది లోక్‌సభ ఎంపీలు చీలిపోతారన్న ఊహాగానాల మధ్య సుఖేందు శేఖర్ రే రాజీనామా చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా టిఎంసి నుండి బహిష్కరణకు గురైన రితబ్రత బెనర్జీ, 58 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం శోభన్‌దేవ్ చటోపాధ్యాయ స్థానంలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి అభిషేక్ బెనర్జీనే బాధ్యుడని రితబ్రత బెనర్జీ వర్గం బహిరంగంగా విమర్శిస్తోంది.








కామెంట్‌లు (0)