హైదరాబాద్: ఎపి మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడి విచారిస్తోంది. గురువారం మధ్యాహ్నం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. సుమారు ఐదు గంటలుగా అధికారులు ఆయనను విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డి రెండుసార్లు విచారణకు హాజరయ్యారు. కుంభకోణానికి సంబంధించి జరిగిన విధాన నిర్ణయాలు, రహస్య ఆర్థిక లావాదేవీలపై ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. బ్యాంకు లావాదేవీలు, విజయసాయి అందించిన వివరాలపై అధికారులు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.
ఎపి మద్యం కుంభకోణం కేసులో విజయసాయి రెడ్డిని విచారిస్తున్న ఈడి
28 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 28, 2026, 05:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)