ప్రజాశక్తి -గండేపల్లి(కాకినాడ) : గండేపల్లి మండలం మురారి గ్రామ శివారులో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మురారి గ్రామానికి చెందిన రండ బుల్లెయ్య (36) అనే వ్యక్తి తన ట్రాక్టర్‌తో పొలం దున్నడం కోసం ఉదయం మురారి గ్రామం నుండి రాజమండ్రి వైపు బయలుదేరాడు. ఈ క్రమంలో మురారి గ్రామ శివారులోకి రాగానే వెనుక నుండి వేగంగా వచ్చిన ఒక లారీ, ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకువెళ్లింది. తీవ్ర గాయాలపాలు కావడంతో ట్రాక్టర్ డ్రైవర్ బుల్లెయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న గండేపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
లారీ ఢీకొని ట్రాక్టర్ డ్రైవర్ మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 08, 2026, 10:11 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)