test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేటి రాత్రి నుంచి చేప ప్రసాదం పంపిణీ..

1 గంట క్రితం

fish
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 08, 2026, 10:09 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్: భాగ్యనగరంలో దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం, మృగశిర కార్తెను పురస్కరించుకుని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సోమవారం రాత్రి నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ ప్రారంభం కానుంది. ఈరోజు రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ పంపిణీ కార్యక్రమం.. రేపు రాత్రి వరకు ఎలాంటి విరామం లేకుండా నిరంతరాయంగా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రసాదం కోసం ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి, తెలుగు రాష్ట్రాల మూలమూలల నుండి వేలాది మంది ప్రజలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి సౌకర్యార్థం అధికారులు నాంపల్లికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. చేప ప్రసాదం తీసుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్