test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్
Live News

ind vs afg : మానవ్ సుతార్ ఆరు వికెట్ల ప్రదర్శన.. అఫ్గాన్ 152 అలౌట్

1 గంట క్రితం

test
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 08, 2026, 11:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 152 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్ మానవ్ సుతార్ ఆరు వికెట్లతో అఫ్గాన్ బ్యాటింగ్ నడుము విరచగా, ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లతో రాణించాడు. కుల్దీప్ యాదవ్ కూడా వికెట్ల వేటలో భాగస్వామి అయ్యాడు. అఫ్గాన్ బ్యాటర్లలో రహ్మత్ షా 60 పరుగులతో ఒంటరి పోరాటం చేయగా, హష్మతుల్లా షాహిదీ 20, సెదిఖుల్లా అటల్ 17, అబ్దుల్ మాలిక్ 16, రహ్మానుల్లా గుర్బాజ్ 12, షరాఫుద్దీన్ అష్రఫ్ 11 పరుగులు చేశారు. మిగిలిన వారిలో జియౌర్ రెహమాన్ షరీఫీ 6, నంగేయాలియా ఖరోటే 4, అఫ్సర్ జజాయ్ 3 పరుగులు చేయగా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ సలీమ్ సఫీ డకౌట్ అయ్యారు. దీంతో తొలి ఇన్నింగ్స్ ముగిసే సమయానికి అఫ్గానిస్థాన్ జట్టు భారత్ కంటే 412 పరుగుల భారీ వెనుకంజలో నిలిచింది. అఫ్గానిస్థాన్ ఘోరంగా విఫలం కావడంతో భారత జట్టు ప్రత్యర్థికి ఫాలో-ఆన్‌ను అమలు చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్