నగదు స్వాధీనం
ప్రజాశక్తి-కె. బిట్రగుంట(ప్రకాశం) : కె. బిట్రగుంట గ్రామంలోని ఒక పేకాట స్థావరంపై జరుగుమల్లి ఎస్సై భాగ్యరాజ్ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 14,030 నగదుతో పాటు పేకముక్కలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై భాగ్యరాజ్ మాట్లాడుతూ.. జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట, క్రికెట్ బెట్టింగ్, గంజాయి రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. పదేపదే నేరాలకు పాల్పడే వారిపై సస్పెక్ట్ షీట్లు తెరిచి ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. ప్రజల ప్రాంతాల్లో ఇలాంటి అసాంఘిక పనులు జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు.







కామెంట్‌లు (0)