test1
ఆదివారం, 14 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉపాధ్యాయుల కృషితోనే చదువులో రాణింపు : విజయ్ దేవరకొండ

3 గంటల క్రితం

Academic excellence is achieved through the efforts of teachers: Vijay Deverakonda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 04:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బల్మూర్ : ఉపాధ్యాయుల కృషితోనే విద్యార్థులు చదువులో రాణిస్తారని సినీ నటుడు విజయ్ దేవరకొండ అన్నారు. ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండల పరిధిలోని తుమ్మనపేట గ్రామంలో విద్యార్థినీ విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ‘ద విజయ్ దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయ్, రష్మిక దంపతులు పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని మంచి మార్కులు సాధించారని వారిని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో నాగర్ కర్నూల్ జిల్లా రెండో స్థానంలో నిలిచిందని, ఇందుకు డీఈవో, ఉపాధ్యాయుల కృషి ఎంతో గొప్పదని అన్నారు. నియోజకవర్గంలోని 45 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 9, 10 తరగతి విద్యార్థులకు నగదు బహుమతి అందించారు. ప్రథమ స్థానంలో మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.10,000, ద్వితీయ స్థానంలో మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.5,000 చొప్పున మొత్తం 181 మంది విద్యార్థులకు విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, డీఈవో రమేష్ కుమార్, పలువురు ఉపాధ్యాయులు, విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్