test1
ఆదివారం, 14 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాల పై ఉక్కుపాదం : జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్

4 గంటల క్రితం

Iron-fist approach towards marijuana, drugs, and cybercrimes: District SP A.R. Damodar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 04:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మెరకముడిదాం (విజయనగరం) : జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు రవాణా, సైబర్ నేరాలపై ఉక్కు పాదం మోపనున్నట్లు జిల్లా ఎస్పీఎ. ఆర్. దామోదర్ వెల్లడించారు. ఆదివారం సాధారణ సందర్శనలో భాగంగా బుధరాయవలస పోలీస్ స్టేషన్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ మహిళల భద్రతతో పాటు సైబర్ నేరాలు అదుపుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మహిళల భద్రత పట్ల అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో తరచూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రమాదాల నివారణకు మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడమే కాకుండా, వాహన చోధకులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. అనంతరం స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించి పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్టేషన్లో దస్త్రాలను పరిశీలించి, సిబ్బంది పనితీరును కొనియాడారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న భవనాలను పరిశీలించి భవనాల్లో పోలీస్ సిబ్బందికి తగు సదుపాయాలు కల్పించాల్సిందిగా ఎస్ఐకి సూచించారు. భవనాలు కూడా పెయింట్స్ వేయాల్సిందిగా, అదేవిధంగా స్టేషన్ పరిసరాల్లో మొక్కలు నాటాల్సిందిగా సూచించారు. ఈ సందర్శనలో ఆయన తో పాటు డి.ఎస్.పి. ఎస్ రాఘవులు, సిఐ జి శంకర్రావు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జె. లోకేష్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్