ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : ప్రజాసేవనే పరమావధిగా భావించి ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న మండలంలోని చొప్పెల్లకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, డీసీ చైర్మన్ మెర్ల గోపాలస్వామికి మరో అరుదైన గౌరవం లభించింది. రాజమండ్రిలో శ్రీశ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు ప్రతిష్టాత్మక ఉత్తమ సేవా పురస్కారం ప్రదానం చేశారు. సమాజ సేవ, ప్రజా సంక్షేమం, రైతు సంక్షేమం, సామాజిక అభివృద్ధి రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వ్యక్తులను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేస్తుండగా, ఈ ఏడాది మెర్ల గోపాలస్వామి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. ప్రస్తుతం డీసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న గోపాలస్వామి రైతుల సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేస్తున్నారు. సాగునీటి కోసం కాలువల నిర్వహణతో రైతులకు అండగా నిలుస్తూ వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలు చూపుతున్నారు. ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని, ప్రజా సంక్షేమం కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని మెర్ల గోపాలస్వామి పేర్కొన్నారు. దీంతో డీసీ చైర్మన్ మెర్లను పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నేతలు, అభిమానులు అభినందించారు. అలాగే మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
డీసీ చైర్మన్ మెర్లకి ఉత్తమ సేవా పురస్కారం
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 14, 2026, 05:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)