test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లక్నో భారీ స్కోరు.. చెన్నై ముందు 204 పరుగుల లక్ష్యం!

10 మే, 2026

Chennai Super Kings vs Lucknow Super Giants, 53rd Match,
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 10, 2026, 05:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో జట్టు స్కోరు రెండు వందల మార్కును దాటింది.జోష్ ఇంగ్లిస్ 85 పరుగులతో జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచారు. అతనికి తోడుగా షాబాజ్ అహ్మద్ 43 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. మిగిలిన వారిలో అక్షత్ రఘువంశీ (18), హిమ్మత్ సింగ్ (17), రిషబ్ పంత్ (15), మిచెల్ మార్ష్ (10), ఎయిడెన్ మార్క్రామ్ (6) మరియు నికోలస్ పూరన్ (1) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ 2 వికెట్లతో రాణించగా.. జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్