test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కదం తొక్కిన కమిన్స్, షకీబ్

18 మే, 2026

ipl
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 19, 2026, 12:32 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- చెన్నై సూపర్ కింగ్స్ 180/7

చెన్నై: ఎం చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన కీలక పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బౌలర్లు సమిష్టిగా చెలరేగారు. కెప్టెన్ పాట్ కమిన్స్ కు తోడు షకీబ్ హుసైన్, ప్రఫుల్ హిండే, ఈషన్ మలింగ చెన్నై బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నైను నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 180 పరుగులకే పరిమితం చేశారు. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నైని భారీ స్కోరు చేయకుండా నిలువరించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించలేకపోయారు. సంజూ శాంసన్ (27) మెరుపులు మెరిపించినా.. కమిన్స్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఉర్విల్ పటేల్ (13) కూడా త్వరగానే ఔటయ్యాడు. దీంతో చెన్నై పవర్ ప్లే 6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి నెమ్మదిగా ఆడి నిరాశపరిచాడు. 21 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. దీంతో చెన్నై 11.3 ఓవర్లలో 100 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కార్తీక్ శర్మ (32; 19 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు), డెవాల్డ్ బ్రెవిస్ (44; 27 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు), శివమ్ దూబే (26; 23 బంతుల్లో, 3ఫోర్లు, సిక్సర్) బాధ్యతాయుతంగా ఆడారు. ముఖ్యంగా బ్రెవిస్, దూబే ఐదో వికెట్‌కు 59 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. చివరి ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు మరింత కట్టడిగా బౌల్ చేశారు. దీంతో చెన్నై ఆశించిన స్థాయిలో స్కోరు నమోదు చేయలేకపోయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన అద్భుతమైన బౌలింగ్‌తో చెన్నై బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. 4 ఓవర్లలో కేవలం 28 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అతనికి తోడుగా సాకిబ్ హుస్సేన్ 2 వికెట్లు తీయగా, ఎషాన్ మలింగ, ప్రఫుల్ హింగే తలో వికెట్ దక్కించుకున్నారు.

స్కోర్ బోర్డు…
చెన్నై సూపర్ కింగ్స్ : సంజు శాంసన్ (సి)ఇషాన్ కిషన్ (బి)పాట్ కమిన్స్ 27, గైక్వాడ్ (సి)ఈషన్ మలింగ (బి) కమిన్స్ 15, ఉర్విల్ పటేల్ (బి)షకీబ్ హుసైన్ 13, కార్తీక్ త్యాగీ (సి)నితీశ్ కుమార్ (బి)కమిన్స్ 32, డేవిడ్ బ్రెవీస్ (బి)ఈషన్ మలింగ 44, శివమ్ దూబే (బి)షకీబ్ హుసైన్ 26, ప్రశాంత్ వీర్ (సి అండ్ బి)ప్రఫుల్ హిండే 11, ఆకెల్ హొసైన్ (నాటౌట్) 3, అదనం 9. (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 180 పరుగులు.
వికెట్ల పతనం: 1/31, 2/48, 3/90, 4/100, 5/159, 6/164, 7/180
బౌలింగ్: నితీశ్ కుమార్ రెడ్డి 2-0-35-0, ప్రఫుల్ హిండే 3-0-37-1, పాట్ కమిన్స్ 4-0-28-3, ఈషన్ మలింగ 4-0-26-1, షకీబ్ హుసైన్ 4-0-34-2, శివాంగ్ కుమార్ 3-0-20-0.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్