test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅక్టోబర్‌‌లో న్యూజిలాండ్ పర్యటనకు టీమిండియా

4 రోజుల క్రితం

team-india
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 03, 2026, 11:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 5 టీ20లు, 5 వ‌న్డేలు, 2 టెస్టులు ఆడ‌నున్న భార‌త్‌

  • షెడ్యూల్ ఖరారు చేసిన ఇరుదేశాల క్రికెట్ బోర్డులు

ఆక్లాండ్‌: ఈ ఏడాది అక్టోబర్ లో భారత పురుషుల క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌ పర్యటనకు బయల్దేరి వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా సుమారు 40 రోజుల పాటు ఈ సిరీస్ కొన‌సాగ‌నున్న‌ది.  అక్టోబ‌ర్ 22 నుంచి డిసెంబ‌ర్ ఒక‌టి వ‌ర‌కు జ‌రిగే ఈ సిరీస్‌లో 5 టీ20 మ్యాచ్‌లు, 5 వ‌న్డేలు, రెండు టెస్టులు ఆడ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు దేశాల మ‌ధ్య జ‌ర‌గ‌బోయే అతిపెద్ద ద్వైపాక్షిక సిరీస్ ఇదే కానున్నది. న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌లో మొత్తం 12 మ్యాచ్‌లు ఉండ‌నున్నాయి. గ‌తంలో ఎప్పుడూ ఇంత భారీ సంఖ్య‌లో అక్క‌డ సిరీస్ జ‌ర‌గ‌లేదు. రెండు దేశాల మ‌ధ్య క్రీడాసంబంధాలకు వందేళ్లు నిండిన నేప‌థ్యంలో ఈ భారీ సిరీస్‌కు ఇరుదేశాల క్రికెట్ బోర్డులు ఆమోదం తెలిపాయి. అక్టోబ‌ర్ 22వ తేదీన తొలి టీ0 మ్యాచ్ క్రైస్ట్‌చ‌ర్చ్‌లో జ‌ర‌గ‌నుంది. టీ20 సిరీస్ త‌ర్వాత వ‌న్డే సిరీస్, న‌వంబ‌ర్ 4న ఆక్లాండ్‌లో తొలి వ‌న్డే, న‌వంబ‌ర్ 19 నుంచి 23 వ‌ర‌కు వెల్లింగ్ట‌న్‌లో ఫ‌స్ట్ టెస్ట్ మ్యాచ్‌, న‌వంబ‌ర్ 27 నుంచి డిసెంబ‌ర్ 1 వ‌ర‌కు రెండో టెస్టు క్రైస్ట్‌చ‌ర్చ్‌లో జ‌ర‌గ‌నున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్