2026 సీజన్‌లో సంచలనాలు సృష్టిస్తున్న 15 ఏళ్ల యువ కెరటం, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపిఎల్ ఒక సీజన్ లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. క్రిస్ గేల్ 2012 ఐపీఎల్ సీజన్‌లో 59 సిక్సులు బాదగా, తాజా వైభవ్ సూర్యవంశీ(65సిక్సర్లు) ఆ రికార్డును అధిగమించాడు. అలాగే ఒక ఐపిఎల్ సీజన్ లో 600 పరుగుల మైలురాయిని దాటిన తొలి టీనేజర్‌గా కూడా మరో ఘనతను అందుకున్నాడు. ఇంతకుముందు దేవదత్ పడిక్కల్ (580) రికార్డును తాజాగా వైభవ్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో రిషభ్ పంత్, పృథ్వీ షా వంటి స్టార్లను సైతం వెనక్కి నెట్టాడు.
29 బంతుల్లో 97 పరుగులు తృటిలో చేజారిన ప్రపంచ రికార్డు
న్యూ ఛండీగడ్: ఎలిమినేటర్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. మొహాలీలోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కీలక పోరులో రాజస్తాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (97; 29 బంతుల్లో, 5 ఫోర్లు, 12 సిక్సర్లు), ధ్రువ్ జురెల్ (50; 21 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ నిర్ణయం తప్పని తేలింది._ పాట్ కమిన్స్ బౌలింగ్‌ను లక్ష్యంగా చేసుకుని వైభవ్ మరింత రెచ్చి పోయాడు. కమిన్స్ వేసిన ఒకే ఓవర్‌లో ఏకంగా 25 పరుగులు పిండుకున్నాడు. తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులకు చేరుకున్నాడు. అయితే, దురదృష్టవశాత్తూ కేవలం 3 పరుగుల తేడాతో రికార్డు సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ క్రమంలోనే, ఒకే ఐపీఎల్ సీజన్‌లో 600 పరుగులు పూర్తి చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రిషబ్ పంత్ రికార్డును సూర్యవంశీ బద్దలు కొట్టడం విశేషం. సూర్యవంశీ అవుటైన తర్వాత కూడా రాజస్థాన్ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ తనదైన శైలిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 21 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (29), కెప్టెన్ రియాన్ పరాగ్ (26) కూడా తమ వంతు సహకారం అందించారు. చివర్లో రవీంద్ర జడేజా (12 నాటౌట్) అజేయంగా నిలిచాడు. సన్‌రైజర్స్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయారు. కెప్టెన్ పాట్ కమిన్స్ తన 4 ఓవర్లలో వికెట్ తీయకుండా ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రఫుల్ హింగే 54 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టినప్పటికీ, పరుగుల వరదను ఆపలేకపోయాడు. నితీష్ కుమార్ రెడ్డి (2 ఓవర్లలో 12 పరుగులు) ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు.
స్కోర్ బోర్డు…
రాజస్తాన్ రాయల్స్ : జైస్వాల్ (సి)అభిషేక్ శర్మ (బి)శివాంగ్ కుమార్ 29, వైభవ్ సూర్యవంశీ (సి)రవిచంద్రన్ (బి)ప్రఫుల్ హింజే 97, ధృవ్ జురెల్ (సి)నితీశ్ రెడ్డి (బి)ప్రఫుల్ హింజే 50, రియాన్ పరాగ్ (సి)క్లాసెన్ (బి)ప్రఫుల్ హింజే 26, ఫెర్రీరా (రనౌట్) శివాంగ్ కుమార్/ఇషాన్ కిషన్ 12, శనక (సి)అభిషేక్ శర్మ (బి)ఈషన్ మలింగ 5, జడేజా (నాటౌట్) 12, ఆర్చర్ (సి)అభిషేక్ (బి)నితీశ్ కుమార్ 4, బర్గర్ (రనౌట్) ఈషన్ మలింగ/ఇషాన్ కిషన్ 1, సుశాంత్ మిశ్రా (నాటౌట్) 1, అదనం 6. (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 243 పరుగులు.
వికెట్ల పతనం: 1/125, 2/137, 3/192, 4/207, 5/214, 6/234, 7/238, 8/240
బౌలింగ్: పాట్ కమిన్స్ 4-0-64-0, ఈషన్ మలింగ 4-0-40-1, సకీబ్ హుసైన్ 4-0-52-0, ప్రఫుల్ హింజే 4-0-54-3, శివాంగ్ కుమార్ 2-0-19-1, నితీశ్ కుమార్ 2-0-12-1.








కామెంట్‌లు (0)