ముంబయి: ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులేకు టీమిండియాలో కీలక పదవి దక్కింది. టీమిండియా ప్రత్యేక స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు బిసిసిఐ మంగళవారం ప్రకటించింది._స్పిన్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బిసిసిఐ ఆ బాధ్యతలను అప్పగించింది. బహుతులే భారత్ తరఫున రెండు టెస్టులు, ఎనిమిది వన్డేలు మాత్రమే ఆడినా.. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 6,176 పరుగులు, 630 వికెట్లు సాధించి విజయవంతమైన ఆల్‌రౌండర్లలో ఒకడిగా నిలిచాడు. విదర్భ, కేరళ, గుజరాత్, బెంగాల్ దేశవాళీ జట్లకు హెడ్ కోచ్‌గా సేవలందించాడు. ఇక ఐపిఎల్‌లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌కు సుదీర్ఘంగా స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. 2022 _ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు.
Print Editionటీమిండియా బౌలింగ్ కోచ్ గా బహుతులే
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 03, 2026, 12:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)