రెండో టి20లో ఇంగ్లండ్ మహిళల గెలుపు
బ్రిస్టల్: రెండో టి20లో భారత మహిళల జట్టుకు నిరాశే లభించింది. ఇంగ్లండ్ మహిళలు నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హర్మన్ ప్రీత్ సేన నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇంగ్లండ్ జట్టు 26 పరుగుల తేడాతో గెలుపొందింది. ఛేదనలో భాగంగా ఓపెనర్లు మంధాన(32), షెఫాలీ వర్మ(22), యాస్టికా భాటియా(33), హర్మన్ ప్రీత్ కౌర్(28) రాణించినా.. రోడ్రిగ్స్(1), రీచా(8), దీప్తి(2), అరుంధతి(4), శ్రేయాంక(6), శ్రీచరణి(1) ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో లోయర్ ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యంతో టీమిండియా ఓటమిపాలైంది. దీంతో మూడు టి20ల సిరీస్ 1-1తో సమంగా ఉండగా.. మూడో, చివరి టి20 మంగళవారం జరగనుంది. తొలుత ఇంగ్లండ్ బ్యాటర్లు వాట్(29), జోన్స్(28), కాప్సే(28) ఫ్రెయా కాప్(39నాటౌట్) రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 168 పరుగుల భారీస్కోర్ చేసింది.








కామెంట్‌లు (0)