test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionCSKకి దొరికిన ఆణిముత్యం కార్తీక్ శర్మ.. బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ విన్నర్‌గా రూ. 14 కోట్ల ప్లేయర్

06 మే, 2026

cricket

CSKకి దొరికిన ఆణిముత్యం కార్తీక్ శర్మ..

వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 06, 2026, 02:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కాస్ట్లీ ప్లేయర్ కార్తీక్ శర్మ మరోసారి రాణించాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన కార్తీక్ శర్మ.. ఢిల్లీపై 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వరుసగా రెండు మ్యాచ్‌లలోనూ నెంబర్ 4లో బ్యాటింగ్‌కి దిగి, అవుట్ కాకుండా మ్యాచ్ విన్నర్‌గా నిలవడం విశేషం.


ఐపీఎల్ 2025 తర్వాత జరిగిన మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన కాస్ట్లీ ప్లేయర్లలో కార్తీక్ శర్మ ఒకరు. ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మను సీఎస్కే మేనేజ్‌మెంట్ రూ. 14.2 కోట్ల చొప్పున కొనుగోలు చేసింది. లోకల్ ప్లేయర్లను అంత ఖర్చు పెట్టి కొనడంపై అప్పట్లో భారీ విమర్శలే వచ్చాయి. ఈ సీజన్ ఆరంభంలో ఇద్దరూ సీఎస్కే తరఫున ఆడినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

ఆయుష్ మాత్రే బయటకు వెళ్లిన తర్వాత కార్తీక్ శర్మ తనదైన శైలిలో రాణించి చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండు మ్యాచ్‌లలో గెలిచింది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లలో కూడా కార్తీక్ శర్మ మంచి ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్