తమిళనాడు : తమిళనాడులో సినీ నటుడిగా మాత్రమే కాదు.. రాజకీయ నాయకుడిగానూ విజయ్ కు ఉన్న ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, సోషల్ మీడియాలో కూడా ఆయన ప్రభావం భారీగా కనిపిస్తోంది.
తమిళనాడు ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా ఖాతాలైన ‘సిఎంఒ తమిళనాడు’ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ పేజీలకు ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యమంత్రి పదవికి ముందు ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు సుమారు నాలుగు లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 15 లక్షలకు చేరుకుంది. అలాగే ఎక్స్ ఖాతాలో కూడా నాలుగు లక్షల నుంచి 21 లక్షలకు ఫాలోవర్లు పెరగడం విశేషం..!
విజయ్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఫొటోను ప్రొఫైల్ చిత్రంగా మార్చిన తర్వాత .... కేవలం 24 గంటల్లోనే దాన్ని 14 లక్షల మందికి పైగా వీక్షించారు. ముఖ్యమంత్రి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కీలక సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ఈ పేజీల్లో నిరంతరం పంచుకుంటున్నారు. అలాగే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భానికి సంబంధించిన ఫొటోలు, మాజీ ముఖ్యమంత్రి M.K.Stalin సహా పలువురు నేతలతో జరిగిన మర్యాదపూర్వక సమావేశాల చిత్రాలను కూడా విజయ్ ఈ అధికారిక ఖాతాల ద్వారా ప్రజలతో పంచుకున్నారు.








కామెంట్‌లు (0)