లక్నో : పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ఇంధన సర్ చార్జీల పేరుతో విద్యుత్ భారాన్ని మోపేందుకు యోగి ప్రభుత్వం సిద్ధమైంది. విద్యుత్ బిల్లులపై 10శాతం పెంపును అమలు చేయాలని సంబంధిత అధికారులకు శనివారం జారీ చేసిన నోటిఫికేషన్ లో ఉత్తరప్రదేశ్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ (యుపిపిసిఎల్) పేర్కొంది. జూన్ నుండి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. దీంతో ప్రజలు విద్యుత్ వినియోగంపై అదనంగా పది శాతం చెల్లించాల్సి వుంటుంది. రెగ్యులేటరీ అఫైర్స్ యూనిట్ (RAU) చీఫ్ ఇంజనీర్ పంకజ్ సక్సేనా ఒక లేఖలో, ఉత్తర ప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ (యుపిఇఆర్) మార్చి 26న జారీ చేసిన నోటిఫికేషన్లో విద్యుత్ పంపిణీ సంస్థలకు మల్టీ ఇయర్ టారిఫ్ (ఎంవైటి)కింద కొత్త నిబంధనలు జారీ చేసిందని రెగ్యులేటరీ అఫైర్స్ యూనిట్ (ఆర్ ఎ యు) చీఫ్ ఇంజనీర్ పంకజ్ సక్సేనా ఒక ప్రకటనలో తెలిపారు. పంపిణీ సంస్థలకు అయ్యే ఇంధనం, విద్యుత్ కొనుగోలు ఖర్చులలోని హెచ్చుతగ్గులను లభర్తీ చేయడానికి వినియోగదారులపై ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ అడ్జస్ట్‌మెంట్ సర్‌చార్జ్ (ఎఫ్ పిపిఎఎస్) విధించాలని ఆదేశించిందని అన్నారు. ఒక నెలలో అయ్యే అదనపు విద్యుత్ కొనుగోలు,పంపిణీ ఖర్చులను మూడు నెలల తర్వాత వసూలు చేస్తారని, అంటే, మార్చి 2026లో అయిన అదనపు ఖర్చును జూన్ 2026లో వినియోగదారుల నుండి వసూలు చేయనున్నట్లు సక్సేనా పేర్కొన్నారు. నియంత్రణ చట్రం ప్రకారం ఈ సర్‌ఛార్జ్‌ను వినియోగదారులందరికీ ఏకరీతిగా అమలు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
ప్రజలపై విద్యుత్ భారం మోపనున్న యోగి ప్రభుత్వం
30 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 30, 2026, 04:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)