test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుండెల్ని ముక్కలు చేసిన ఉక్కు ప్రమాదం

4 రోజుల క్రితం

fire accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 11, 2026, 05:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

విశాఖ నగరం స్టీల్ ప్లాంట్ లో 150 టన్నుల వేడి ఉక్కు ద్రవం ఒకే సారి లీక్ అయిన పెను ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం, ఆరుగురు తీవ్ర గాయాల పాలవడం తీవ్ర విషాదం.1500 డిగ్రీల వేడిమికి భారీ పరికరాలు కూడా మాడి మసి అయిన దుర్ఘటనలో బాధితులు, మృతులు ఎంత నరకం చూసి ఉంటారో తలచుకుంటేనే గుండె ముక్కలౌతుంది. గతంలో ప్రమాదాలు జరిగినా, ఇలా భారీ స్థాయిలో విస్ఫోటనం జరగడం బహుశా ఇదే తొలిసారి. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలను, నిర్వహణ, ప్రమాద నివారణ, తనిఖీ వ్యవస్థల పట్ల సందేహాల్ని రేకెత్తించే ప్రమాదమిది. రాష్ట్రానికే కాకుండా దేశానికే తలమానికంగా నిలిచే ఈ ప్రభుత్వ రంగ సంస్థ పట్ల ప్రభుత్వాలు పూర్తి శ్రద్ధ పెట్టడం అవసరం. లాభనష్టాల కోణాలతో పాటు పూర్తి భద్రత, అవసరమైన సిబ్బంది భర్తీ, ప్రమాద రహిత చర్యలు, ఉద్యోగ భద్రత, గనుల కేటాయింపులతో మంచి ఉత్పాదకత తదితర కోణాలపై దృష్టి పెట్టి అంతర్జాతీయ ప్రమాణాలను సాధించాలి. జాతి గౌరవంగా భావించాలి. ఇప్పుడు జరిగిన ప్రమాదం ఆయా బాధితుల కుటుంబాలకే పరిమితం కాదు. వారి ప్రాణాల్ని కబళించడంతో బాటు, కర్మాగారం ప్రతిష్టని కూడా మసకబార్చింది. ఆయా కుటుంబాల్ని ఆదుకోవడంతో బాటు ప్రమాదంపై అంతర్జాతీయ ప్రమాణాలతో లోతైన దర్యాప్తు జరగాలి. తప్పుల్ని గుర్తించాలి. లోపాల్ని సరిదిద్దాలి. సంపూర్ణ ప్రమాద రహిత కర్మాగారంగా తీర్చిదిద్దే సమగ్ర చర్యలు అవసరం. ​

- డా. డి. వి. జి. శంకరరావు, మాజీ ఎంపీ, విజయనగరం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్