విజయవాడ: మోడీ అనుసరిస్తున్న విధానాలతో దేశ రాజకీయాల్లో ప్రమాదకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, వాటిని ఎదుర్కునేందుకు వామపక్షాలతో పాటు, ప్రజలు పోరాటాలకు, ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు పిలుపునిచ్చారు. ‘ప్రస్తుత రాజకీయ పరిణామాలు` అనే అంశంపై శనివారం సాయంత్రం విజయవాడ ఎంబివికెలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఇజ్రాయిల్‌తో కలిసి అమెరికా ఇరాన్‌పై దురాక్రమణకు పాల్పడిందని తెలిపారు. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా పడిందని, అయిల్, గ్యాస్, ఎరువుల ధరలు పెరిగాయని తెలిపారు. సంక్షోభం నుండి బయటపడేందుకు అమెరికా దాడులకు తెగబడుతున్నా ఎక్కడా విజయం సాధించలేదని పేర్కొన్నారు. మరోవైపు మోడీ ఇరాన్‌తో భారతదేశానికి ఉన్న 3000 సంవత్సరాల మిత్ర బంధానికి ద్రోహం చేసి, అమెరికాకు దాసోహం అయ్యారని, ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు. అయినా ఇరాన్ మాత్రం ఇప్పటికీ మిత్ర ధర్మాన్ని పాటిస్తోందని పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)