ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్ నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. శాసనసభలో కూటమికి ఉన్న ఏకపక్ష బలాబలాల దృష్ట్యా, ఈ నాలుగు స్థానాలు ఏకగ్రీవం కాబోతుండటం దాదాపు ఖరారైంది. కూటమి ఒప్పందంలో భాగంగా టిడిపి మూడు స్థానాల్లో, జనసేన పార్టీ ఒక స్థానంలో తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి. టిడిపి తరపున సానా సతీశ్, విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, పార్టీ సోషల్ మీడియా వింగ్ ఇన్‌ఛార్జ్ చింతకాయల విజయ్‌లు శనివారం తమ నామినేషన్ పత్రాలను అధికారికంగా దాఖలు చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీరికి బి-ఫారాలను అందజేసి, నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేయించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించారు. పార్టీకి ఆయన అందించిన సేవలు, నిబద్ధతను గుర్తిస్తూ ఈ అవకాశం కల్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. లింగమనేని రమేశ్ కూడా అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ప్రతిపక్ష వైసిపి సంఖ్యాబలం లేకపోవడంతో ఈ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకి దించలేదు. దీంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కూటమికి చెందిన ఈ నలుగురు అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.
ఎపి రాజ్యసభ ఎన్నికలు.. ఏకగ్రీవం దిశగా కూటమి అభ్యర్థుల ఎన్నిక
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 08, 2026, 01:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)