రూ. 50 లక్షల నజరానా అందజేత
చెన్నై : నార్వే చెస్ టోర్నమెంట్‌లో చారిత్రక విజయం సాధించిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందను తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఆయనకు రూ. 50 లక్షల నగదు పురస్కారాన్ని, జ్ఞాపికను అందజేశారు. సత్కార కార్యక్రమం అనంతరం ప్రజ్ఞానందతో సీఎం విజయ్ కాసేపు సరదాగా చెస్ ఆడి ఆయన్ను ఉత్సాహపరిచారు. తమిళనాడు క్రీడాభివృద్ధి ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆధవ్ అర్జున, క్రీడాభివృద్ధి సంస్థ సభ్య కార్యదర్శి జె. మేఘనాథ రెడ్డితో పాటు ప్రజ్ఞానంద తల్లిదండ్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ వేదికపై దేశానికి, తమిళనాడు రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన ప్రజ్ఞానంద మేధస్సును సీఎం విజయ్ ప్రత్యేకంగా అభినందించారు.








కామెంట్‌లు (0)