mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏపీలో స్కూల్, కాలేజీ విద్యార్థులకు ఆ సేవలు పూర్తిగా ఉచితం.. త్వరపడండి, ఈ నెల 22 వరకే ఛాన్స్

12 మే, 2026

rbi
avatar
Mathew

ప్రచురించబడింది మే 12, 2026, 10:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

Andhra Pradesh Aadhaar Camps 2026 Details: ఏపీ విద్యార్థులకు ముఖ్యమైన గమనిక.. ఆధార్ బయోమెట్రిక్‌ అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాస్ట్రంలో ‌ప్రత్యేక ఆధార్ క్యాంపులను ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు.. ఈ నెల 19 నుంచి 22వరకు నిర్వహిస్తున్నారు. ఆధార్ బయోమెట్రిక్ పెండింగ్ ఉన్నవారు వెంటనే అప్డేట్ చేసుకోవాలంటున్నారు. 5 ఏళ్ల నుంచ 15 ఏళ్లలోపు విద్యార్థులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలలో స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు.. ఆధార్ క్యాంప్ షెడ్యూల్ కోసం స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డ్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. సచివాలయాలు మాత్రమే కాదు.. అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా ఈ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 12 నుంచి 15 వరకు తొలి విడతగా.. ఈ నెల 19 నుంచి 22 వరకు రెండో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆధార్‌లో బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి. అందుకే 5 ఏళ్ల నుంచి 15 ఏళ్లలోపు వారు వెంటనే వారి ఆధార్ వివరాలను అప్డే్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్