ప్రజాశక్తి - బాపట్ల జిల్లా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మరణించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. భౌతికకాయాన్ని శనివారం బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పావులూరు లోని ఆయన నివాసం వద్ద ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆదివారం ఉదయం పావులూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు గాదె మధుసూదన్ రెడ్డి తెలిపారు. వెంకటరెడ్డి మృతి పట్ల ఉభయ రాష్ర్టాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. 1940 జూలై 10న ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలంలోని పావులూరు గ్రామంలో జన్మించిన గాదె వెంకటరెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేదురుమల్లి జనార్థనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య మంత్రివర్గాల్లో మంత్రిగా సేవలందించారు. అనంతరం టిడిపి, వైసిపిలో కొనసాగారు. ఆయన కుమారుడు గాదె మధుసూదన్‌రెడ్డి ప్రస్తుతం పర్చూరు వైసిపి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.
మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి మృతి
29 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 30, 2026, 12:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)