ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఇఎపిసెట్-2026 బుధవారంతో ముగిసింది. ఈ నెల 12 నుంచి ప్రారంభమైన ఈ పరీక్షకు మొత్తంగా 92.60శాతం మంది హాజరయ్యారని ఉన్నత విద్యామండలి కార్యదర్శి బి తిరుపతిరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్, ఫార్మా పరీక్షకు ఎంపిసి విద్యార్ధులు 2,76,576 మంది దరఖాస్తు చేసుకోగా, 2,58,545 (93.48శాతం) మంది హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మా పరీక్షకు బైపిసి విద్యార్ధులు 79,227 మంది దరఖాస్తు చేసుకుంటే వీరిలో 70,929 మంది(89.53శాతం) హాజరయ్యారు. మొత్తం 3,55,803 మంది దరఖాస్తు చేసుకోగా, 3,29,474 (92.60శాతం) మంది హాజరయ్యారు.
ముగిసిన ఇఎపిసెట్
21 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 21, 2026, 07:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)