test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తెనాలిలో యువకుడి దారుణ హత్య

20 మే, 2026

crimes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 20, 2026, 09:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం


- గ్రామంలో విషాదఛాయలు

ప్రజాశక్తి-తెనాలిరూరల్ : తెనాలి మండల పరిధిలోని కంచర్లపాలెం గ్రామంలో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. గ్రామంలోని వాలీబాల్ కోర్టు సమీపంలో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటన విషయం తెలుసుకున్న తెనాలి గ్రామీణ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. హతుడు కంచర్ల పాలెం గ్రామానికి చెందిన కోపల్లె కార్తిక్(18)గా పోలీసులు గుర్తించారు. అక్కడే ఉన్న వాలీ బాల్ స్తంబానికి హతుడు వేలాడుతూ వున్నాడు. హత్య లేక ఆత్మ హత్య అన్న కోణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటన స్థలాన్ని తెనాలి డీఎస్పీ బి. జనార్ధనరావు పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు. కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. ఘటనపై ఆధారాలు సేకరించేందుకు క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. పోలీస్ జాగిలంతో హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ దారుణ ఘటనతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్