ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు – 2026 కోసం అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారీయ వెల్లడించారు. గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో కనీసం పదేళ్ల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అర్హులని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని, జూలై 13వ తేది వరకు సమర్పించాలని వెల్లడించారు. ఆన్‌లైన్ వెబ్ పోర్టల్ https://nationalawardstoteachers.education.gov.in/ ద్వారా మాత్రమే సమర్పించాలని పేర్కొన్నారు. జిల్లా, రాష్ట్ర కమిటీల పరిశీలన అనంతరం, జాతీయ స్థాయి స్వతంత్ర జ్యూరీ తుది విజేతలను ఎంపిక చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో అర్హత గల ఉపాధ్యాయులందరూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2026కు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 17, 2026, 06:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)