శ్రీలంకపై 87 పరుగుల తేడాతో బోణీ
మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు అద్భుత ప్రదర్శనతో శ్రీలంకపై 87 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుని టోర్నీని ఘనంగా ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ ఓపెనర్ డాని వ్యాట్-హాడ్జ్ చెలరేగి ఆడి సెంచరీతో కదం తొక్కింది. ఆమె కేవలం 62 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్‌తో 105 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. మరో ఓపెనర్ అమీ జోన్స్ (53 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించగా, చివర్లో కెప్టెన్ నాట్ సీవర్-బ్రాంట్ (46 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. శ్రీలంక బౌలర్లలో మాల్కి మదారకు ఒక వికెట్ దక్కింది.
చేతులెత్తేసిన శ్రీలంక బ్యాటర్లు
220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళల జట్టు ఇంగ్లండ్ బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లు 132 పరుగులకు ఆలౌట్ అయింది. నిలాక్షిక సిల్వా (39), హర్షిత సమరవిక్రమ (29) మాత్రమే కాస్త పర్వాలేదనిపించారు. కెప్టెన్ చమరి ఆటపట్టు (4) సహా మిగిలిన బ్యాటర్లందరూ పూర్తిగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రేయా కెంప్ అద్భుతమైన స్పెల్‌తో 4 వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించగా.. సోఫీ ఎకిల్‌స్టోన్, చార్లెట్ డీన్ చెరో రెండు వికెట్లు, లిన్సే స్మిత్, లారెన్ బెల్ చెరో వికెట్ సాధించారు.








కామెంట్‌లు (0)